Sunday 8th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’

‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’

Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కు యువతలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.

వయస్సుతో సంబంధం లేకుండా పవన్ కు అభిమానులు ఉన్నారని మరోసారి నిరూపితం అయ్యింది. పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు , పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు.

తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి, రూ.27వేలతో గరగ చేయించి సమర్పించారు. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిసిన వెంటనే, పవన్ కళ్యాణ్ శుక్రవారం పేరంటాలుని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆవిడతో కలిసి భోజనం చేశారు. అనంతరం చీరను, రూ.లక్ష రూపాయల నగదును ఆమెకు అందించారు.

You may also like
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions