Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన మహిళల కోసం చెప్పులు పంపించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే తమ బాధల్ని అర్ధం చేసుకుని పాదరక్షలు పంపడం పట్ల గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని గిరిజన గ్రామం అయిన పెదపాడులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు పవన్ కు స్వాగతం పలికారు. అయితే చెప్పులు లేకుండా వృద్దురాలు నడిచి రావడాన్ని పవన్ గమనించారు.
వెంటనే గ్రామంలో ఎంతమంది ఉన్నారు, వారికి ఏ సైజు చెప్పులు వస్తాయనే విషయంపై ఉపాధిహామీ సిబ్బందితో సర్వే చేయించారు. గురువారం ఉపముఖ్యమంత్రి కార్యాలయం పెదపాడు గ్రామంలోని 345 మందికి చెప్పులు పంపింది.
అధికారులు మరియు స్థానిక నేతలు ఇంటింటికీ తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం తమ కోసం చెప్పులు పంపడం తో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.