Delhi Assembly Elections 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ( Schedule ) ఖరారు అయ్యింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 2.08 లక్షల తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 కేంద్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. జనవరి 10న నోటిఫికేషన్ ( Notification ) విడుదల కానుంది.
నామినేషన్లకు చివరి తేదీ 17, జనవరి 20 విత్ డ్రా ( Withdraw )కు చివరి తేదీ. ఎన్నికల ప్రక్రియపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఈసీ తెలిపింది. అవకతవకలకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.