Monday 23rd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు..ఆ గ్యాంగ్ పనేనా !

యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు..ఆ గ్యాంగ్ పనేనా !

Death Threat To Cm Yogi Adityanath | ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) ముఖ్యమంత్రిని హత్య చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడడం కలకలం రేపింది. ఈ మేరకు ముంబయి పోలీస్ ( Mumbai Police ) కంట్రోల్ రూమ్ కు శనివారం సాయంత్రం ఓ మెసేజ్ వచ్చింది.

యోగి పదిరోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ( Baba Siddique ) లాగే యోగిని హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తం అయిన పోలీసులు సీఎం యోగి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ ( Alert ) చేశారు.

మరోవైపు కేసు నమోదు చేసి ఈ బెదిరింపులు చేసింది ఎవరు అనే దానిపై విచారణ ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఎన్సీపీ సీనియర్ నాయకులు బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ( Lawrence Bishnoi Gang ) సభ్యులు కాల్చి చంపిన విషయం తెల్సిందే.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ( Salman Khan ) కు సన్నిహితంగా ఉండడం వల్లనే హత్య చేసినట్లు లారెన్స్ గ్యాంగ్ తెలిపింది. తాజగా యోగి ఆదిత్యనాథ్ కు కూడా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions