CP Radhakrishnan is new Vice President | ఉప రాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. సాయంత్రం ఫలితాలు వెలువడ్డాయి.
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా నిలిచిన సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉభయ సభలకు చెందిన 781 మంది ఎంపీలకు గాను 767 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇందులో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. మరోవైపు ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో 17వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
త్వరలోనే ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓటింగ్ కు 14 మంది గైర్హాజరు కాగా, 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇకపోతే బీఆరెస్, బీజేడీ మరియు శిరోమణి అకాళీదళ్ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.










