Saturday 5th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీజేపీ బీఆరెస్ ఒక్కటవుతున్నాయి…!

బీజేపీ బీఆరెస్ ఒక్కటవుతున్నాయి…!

Bjp and brs are coming together

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్ ఒక్కటవుతున్నాయని ప్రముఖ జర్నలిస్ట్ (journalist) ఇండియన్ ఎక్స్ ప్రెస్ (indian express) ఎడిటర్ (editor) కూమి కపూర్ సంచలన ఆర్టికల్(article) ను విడుదల చేశారు.

ఇప్పుడు ఈ ఆర్టికల్ మూలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చినట్లైంది.

కర్ణాటక (karnataka) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయా సమీకరణాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం తో తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనపడుతుంది.

కొత్త నాయకులు పార్టీలో చేరుతున్నారు. అలాగే అధిష్టానం కూడా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించింది.
మరోవైపు బీజేపీ తెలంగాణ నాయకత్వాన్ని మార్పు చేసి ఎన్నికల్లో విజయం సాదించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కానీ బీజేపీ మరియూ బీఆరెస్ రెండు పార్టీలు మిత్రులేనని, సమయం వచ్చినప్పుడు కలుస్తారని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. అలాగే బీఆరెస్ జాతీయ స్థాయిలో బీజేపీకి బి-టీం (B-team) అని స్వయంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

బీఆరెస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పైన ఎటువంటి విమర్శలు చేయడం లేదని , అలాగే కవితను లిక్కర్ స్కాం (liquor scam) నుండి తప్పించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని కారణం బీజేపీ , బీఆరెస్ పార్టీలు పరోక్షంగా మిత్రులు ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ప్రముఖ జర్నలిస్ట్ కూమి కపూర్ ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఆ ఆర్టికల్ తెలంగాణలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందని, కె చంద్రశేఖర్ రావు బీఆర్‌ఎస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని ఇటీవలి పోల్ సర్వేలు సూచించడంతో బీజేపీ దక్షిణాది ఎన్నికల వ్యూహాన్ని సవరించుకుందని కపూర్ ఆర్టికల్ ను విడుదల చేశారు.

తాజాగా కేసీఆర్ తనయుడు కెటిఆర్ (KTR)ని అమిత్ షా కలిశారు. రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా కేటీఆర్ సంభాషించారు. ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌తో పోరాడడమే ఈ రెండు పార్టీల మధ్య సంధి అని కపూర్ ఆరోపించారు.

బేరంలో భాగంగా కేసీఆర్ కుమార్తె కె.కవితపై మనీలాండరింగ్ అభియోగాన్ని కోల్డ్ స్టోరేజీలో (Cold storage) పెట్టే అవకాశం ఉందని కూమి కపూర్ వ్యాఖ్యానించారు.

You may also like
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
బీజేపీపై విషం కక్కడమే వాళ్ల ఎజెండా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
south concern on delimitation
త్వరగా పిల్లల్ని కనండి.. సీఎం రిక్వెస్ట్.. అసలు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఎందుకు?
komatireddy venkat reddy
హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?
kcr revanth
కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions