Monday 12th January 2026
12:07:03 PM
Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు

రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు

Congress leader Rahul Gandhi congratulated Revanth Reddy

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్న రాహుల్ గాంధీ
-తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని తీసుకు వస్తుందని వ్యాఖ్య
-అగ్రనేతలను కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకు వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఓ ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు అధిష్ఠానానికి ధన్యదాలు తెలిపారు. కాగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను రేవంత్ రెడ్డి కలిశారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions