Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు!

రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు!

CM Revanth Reddy to Delhi regarding allocation of departments to ministers

CM Visits Sircilla District | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాపై వరాల జల్లు కురిపించారు.

ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ. 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి  పనులకు ధర్మగుండం వద్ద సీఎం శంకుస్థాపన చేశారు.

రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ. 166  కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. రూ.50 కోట్లతో  నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు , రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేశారు. మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

సిరిసిల్ల లో  రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో  రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించారు. 

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions