CM Revanth Reddy Pays Tribute to Gaddar on His Birth Anniversary | ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ నివాళులు అర్పించారు.
తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక అని స్మరించుకున్నారు.
గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ‘గద్దరన్నా…తెలంగాణ గుండెల్లో నువ్వొక చెరగని జ్ఞాపకం’ అని ముఖ్యమంత్రి గద్దర్ సేవల్ని స్మరించుకున్నారు.