Cm Revanth Reddy News | తమకు రాగి సంకటి, చేపల పులుసు వద్దని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో కెసీఆర్, హరీష్ సాగునీటి మంత్రులుగా ఉన్నారని నిర్లక్ష్యమో.., అహంకారమో తెలియదు కానీ… వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయని ఆరోపించారు సీఎం రేవంత్.
కెసిఆర్ అండ్ కో… బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నదుల పునరుజ్జీవనం కోసం కాదు బీఆరెస్ పునరుజ్జీవనం కోసం వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
3 వేల టీఎంసీలు వరద జలాలు ఉన్నాయని కేసీఆర్ కు ఏ దేవుడు చెప్పిండో కానీ..చంద్రబాబు దీన్ని అదనుగా తీసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రపోజల్ కు కొనసాగింపుగా ఇదే ప్రజా భవన్ లో జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి కెసిఆర్ గోదావరి జలాలు తీసుకుపొమ్మన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.