CM Revanth Reddy | ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ (Traffic Constable) చూపిన సమయస్ఫూర్తి, సేవా దృక్పథాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆదివారం యూపీఎస్సి ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెల్సిందే. కాగా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉన్న ఓ యువతి మైలార్ దేవుపల్లిలో ఆర్టీసీ బస్సు దిగారు.
అయితే పరీక్ష కేంద్రం దూరంగా ఉండడంతో ఆ యువతి సమయానికి చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ తన బైక్ పై ఆ యువతిని పరీక్ష కేంద్రానికి తరలించారు.
సమయస్ఫూర్తితో సేవా దృక్పథాన్ని ప్రదర్శించిన కానిస్టేబుల్ సురేశ్ పై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు.
“వాహనాల నియంత్రణ మాత్రమే…
తన డ్యూటీ అనుకోకుండా…
సాటి మనిషికి సాయం చేయడం…
తన బాధ్యత అని భావించిన…
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు…
నా అభినందనలు.
సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి…విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ” అని సురేష్ సేవలను కొనియాడారు సీఎం రేవంత్