KCR Satires On Revanth | గులాబీ బాస్ కేసీఆర్ (KCR) బుధవారం కొడంగల్ బీఆరెస్ ప్రజా ఆశీర్వాద సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై విమర్శనాస్త్రాలు సంధించారు.
9 ఏండ్లు ఎమ్మెల్యే గా ఉన్న రేవంత్ రెడ్డి ఏం పని చేయలేదని, ఇతరులను తిట్టి నోరు పారేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
కొడంగల్ లో నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) గెలిచిన తర్వాత, కేటీఆర్ (KTR) దత్తత తీసుకున్న తర్వాతనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేసారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని, 10 హెచ్పి మోటార్ పెట్టుకోవాలని అంటున్నాడని అస్సలు రేవంత్ రెడ్డి ఏనాడు అయిన వ్యవసాయం చేశాడా? అంటూ ప్రశ్నించారు కేసీఆర్.
కొడంగల్ సరిపోదని, ఇప్పుడు కామారెడ్డి (Kamareddy)కి వచ్చి తన పై పోటీ చేస్తున్నాడని రేవంత్ పై ఫైర్ అయ్యారు కేసీఆర్.
కామారెడ్డి లో ప్రజలు ఆయన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, కొడంగల్ లో కూడా చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు గులాబీ అధిపతి.
నేనే సీఎం అనే వాళ్ళు కాంగ్రెస్ లో 15 మంది ఉన్నారని, అస్సలు కాంగ్రెస్ గెలిస్తే కదా రేవంత్ సీఎం అయ్యేది అంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.
రేవంత్ సీఎం అవుతాడని ఓట్లు వేస్తే కొడంగల్ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని హెచ్చరించారు.