Thursday 19th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రాజధాని అమరావతి పై సీఎం చంద్రబాబు ఎమోషనల్

రాజధాని అమరావతి పై సీఎం చంద్రబాబు ఎమోషనల్

AP Capital Amaravati News | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజధానిగా అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్ ( X ) వేదికగా సీఎం ఎమోషనల్ కామెంట్స్ ( Emotional Comments ) చేశారు.

‘ అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ ( YCP ) కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. ‘ అని 22 అక్టోబర్ 2022న చంద్రబాబు చేసిన పోస్ట్ ను మళ్లీ గుర్తుచేసుకున్నారు.

అనంతరం విధి చివరకు దాని మార్గాన్ని కనుగొంది అని సీఎం తెలిపారు. ఐదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురై, ఆశలు సన్నగిల్లిన అమరావతి నేడు మళ్లీ పుంజుకుంది. మన ప్రజల రాజధాని ఇప్పుడు పునర్నిర్మించబడుతుంది అని హర్షం వ్యక్తం చేశారు.

మన రాజధాని నగర కలను తిరిగి పొందుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మన రైతు సోదరీమణులు మరియు సోదరులు తమ నిరసనల ద్వారా రాజధాని కలను సజీవంగా ఉంచారు అని కొనియాడారు. నాటి క్రూరత్వానికి వ్యతిరేకంగా బలంగా నిలిచారని అభినందించారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions