Cm Chandrababu-Deputy Cm Pawan Kalyan Meeting | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
సోమవారం ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పవన్ ఢిల్లీ పర్యటన, కాకినాడ పోర్టు ద్వారా బియ్యం స్మగ్లింగ్ ( Smuggling ), మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక మరియు నామినేటెడ్ పదవులపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం ఢిల్లీ లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులను మరియు ప్రధాని మోదీని కలిశారు.
ఢిల్లీ పర్యటన వివరాలను సీఎంతో పంచుకున్నారు. అలాగే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడ్డ ఘటన పై కూడా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. వీటితో పాటు సోషల్ మీడియా కేసుల అంశంపై కూడా భేటీలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.