AP Govt. Fact Check | సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) స్పెషల్ ఫ్లైట్ ( Special Flight )లో రహస్యంగా బెంగళూరు ( Bengaluru ) వెళ్లారని సంచలన ఆరోపణలు చేసింది వైసీపీ ( Ysrcp ).
వానపల్లి గ్రామసభ పర్యటన తర్వాత రాజమండ్రి నుండి ప్రత్యేక విమానంలో చంద్రబాబు బెంగళూరు వెళ్లారని, అక్కడ తాజ్ హోటల్ లో సుమారు రెండున్నర గంటలపాటు గడిపారని వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
బెంగళూరులో చంద్రబాబు ఎవర్ని కలిశారు, దేనికోసం వెళ్ళారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని పేర్కొంది. అంతేకాకుండా మంత్రి లోకేష్ ( Nara Lokesh ) రహస్యంగా వారంలో రెండవ సారి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వైసీపీ ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ ఫాక్ట్ చెక్ విభాగం ( Ap Govt. Fact Check )..ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.
” ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బెంగళూరు టూర్ రహస్యంగా ఉంచారనేది అవాస్తవం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) , మంత్రి లోకేష్ ప్రత్యేక విమానాలలో ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. ఇదంతా ఫేక్ ప్రచారం.” అని ఫాక్ట్ చెక్ కొట్టిపారేసింది.