Cigarette In Hyderabad Bawarchi Biryani | బిర్యానీ తింటుండగా అందులో సగం తాగేసిన సిగరెట్ ( Cigarette ) దర్శనమివ్వడంతో కస్టమర్లు ఖంగు తిన్నారు.
గత కొన్నిరోజులుగా ఫుడ్ సేఫ్టీ ( Food Saftey ) అధికారులు రెస్టారెంట్ల పై దాడులు చేసి నాణ్యత, శుభ్రత పాటించని హోటల్స్ పై కఠిన చర్యలు తిసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్లు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదు.
ఆహారంలో జెర్రీ, చట్నీలో బొద్దింకలు వచ్చిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజగా బిర్యానీలో సిగరెట్ పీక కనిపించడం సంచలనంగా మారింది.
హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డు ( RTC X Road )లోని బావర్చిలో కొందరు బిర్యానీ తినడానికి వెళ్లారు. ఆర్డర్ రాగానే ఆరగించ సాగారు, కానీ ఉన్నట్టుండి వారికి బిర్యానిలో సగం తాగి వదిలేసిన సిగరెట్ ముక్క కనిపించింది. దింతో వారు సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దింతో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.