Chevella Lorry Accident | రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది.
చేవెళ్ల మండలం ఆలూరి స్టేజి వద్ద 50 మంది కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇంతలోనే వారిపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొని ఆగిపోయింది.
కానీ ఇంతలోనే పెను విషాదం జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది.
డ్రైవర్ మాత్రం క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.