- బండి సంజయ్ కి జాతీయ స్థాయిలో కీలక పదవి?
- తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి?
- బుధవారం కేంద్ర మంత్రివర్గా పునర్వ్యవస్థీకరణ.
Big Changes In Telangana BJP | తెలంగాణ బీజేపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా.. పార్టీ అధ్యక్షడిలో మార్పు ఉండబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
టీ బీజేపీ రథసారథి బండి సంజయ్ స్థానం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదే విధంగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు కీలక పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ, అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు.
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పలు..?
కేంద్ర మంత్రివర్గం లో భారీ మార్పులకు స్వీకారం చేపడుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం.
పలు మంత్రులను తప్పించి రాష్ట్రాల్లో బాధ్యతలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ మీడియా పేర్కొంది.
కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మల సీతారామన్ కు తమిళనాడు పార్టీ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం.
ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా మార్పులు ఉండనున్నాయి.
అందులో భాగంగానే రాజస్థాన్ లో కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర షేకవత్ కు రాజస్థాన్ ఎన్నికల బాధ్యతలు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వ్యవసాయ శాఖమంత్రి నరేంద్రతోమర్ కు కీలకంగా ఉన్న మధ్యప్రదేశ్ బాధ్యతలు ఇవ్వనున్నారు.
వీరితో పాటు విద్యశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్రప్రధాన్ కు ఒడిశా, బొగ్గు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి కర్ణాటక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇలా పలువురి కేంద్రమంత్రులని తప్పించి రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
తెలంగాణపై ప్రత్యేక గురి..
ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీలో భారీ మార్పులు ఉండనున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం లేదా జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.
బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు చేపట్టాలని కేంద్రం పెద్దలు కోరుతున్నట్లు సమాచారం.
కానీ కిషన్ రెడ్డి విముఖత చూపుతున్నారని, కాని ఆయనను బుజ్జగించి ఒప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది.
అలాగే బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ , ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావులకు కూడా కీలక బాధ్యతలు ఇవ్వడానికి కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
బీఆరెస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరి ఉపఎన్నికల్లో గెలిచి పార్టీకి మైలేజ్ పెంచిన ఈటెల రాజేందర్ కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచి పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన రఘునందన్ రావుకు కూడా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇలా తెలంగాణలో భారీ మార్పుల ద్వారా ప్రస్తుతం నెలకొన్న నిరాశ, స్తబ్దతను తొలగించి ఎన్నికల వేళ పార్టీని పరుగులు పెట్టించాడని మోదీ, అమిత్ షాలు వ్యూహాలు రచిస్తున్నారు.
బండి అసంతృప్తి
బీజేపీ లో భారీ మార్పులు జరగనున్నాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తనను అధ్యక్ష బాధ్యతలు నుండి తొలగించడం పట్ల బండి సంజయ్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.
తన సన్నిహిత వర్గాల వద్ద అసహనాన్ని వ్యక్తం చేశారని సమాచారం.
ఇటీవలే శాసనసభ ఎన్నికల వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటారని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి మీడియాతో అన్నారు.
కానీ ఇప్పుడు మార్పులు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యం లో ఆయన అసహనాన్ని వ్యక్తంచేశారు.
ఒకవేళ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే మరేయితర పదవిని స్వీకరించకుండ కేవలం పార్టీ కార్యకర్తగా పని చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పారని సమాచారం.
బుధవారం పునరవ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నాయకులతో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా మరియు బిఎల్ సంతోష్ ఢిల్లీలో మంతనాలు జరుపనున్నారు.
అలాగే ఆంధ్రాలో ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో సత్యకుమార్ యాదవ్ కు బాధ్యతలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.