Chandrababu’s Brother Passes Away | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ( Nara Ramamurthy Naidu ) శనివారం తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సోదరుడి మరణవార్త విన్న ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) ఆసుపత్రికి చేరుకున్నారు.
అలాగే నారా, నందమూరి ( Nandamuri ) కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు తనయుడు ప్రముఖ నటుడు నారా రోహిత్.