Chandra Babu Affidavit | మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కుప్పం (Kuppam) నియోజకవర్గ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అఫిడవిట్ ను సమర్పించారు.
కాగా తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు చంద్రబాబు. 2019 కంటే ముందు బాబు పై కేవలం రెండు కేసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 24 కు చేరింది. అలాగే 2019 ఎన్నికల తో పోల్చితే ఆస్తులు భారీగా పెరిగాయి.
2019 లో టీడీపీ అధినేత ఆస్తులు రూ.545 కోట్లు ఉండగా ఇప్పుడు అవి రూ.931 కోట్లకు చేరింది. అఫిడవిట్ ప్రకారం చంద్రబాబుకు రూ.4 లక్షల 80 వేల చరాస్థులు, రూ.36 కోట్ల 31 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి. సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
వీటిలో హెరిటేజ్ షేర్ల విలువే రూ.763 కోట్ల పై మాట. చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు.









