Champions Trophy star KL Rahul rejects DC captaincy offer | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy-2025 ) విజయవంతంగా ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో న్యూజీలాండ్ ను ఓడించి టీం ఇండియా విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ ( IPL ) పైనే ఉంది. మార్చి 22 నుండి ఈ మెగా టోర్నీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) తరఫున ఆడనున్న కేఎల్ రాహుల్ కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రతిపాదించిన కెప్టెన్సీ ఆఫర్ ను రాహుల్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. బ్యాటర్ గానే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు క్రీడావర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో రాహుల్ కీలక పాత్రను పోషించారు.
మరోవైపు రాహుల్ నో చెప్పడంతో యాజమాన్యం కెప్టెన్సీ కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో ప్రముఖంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పేరు వినిపిస్తుంది. ఇదిలా ఉండగా గతేడాది జరిగిన మెగా ఆక్షన్ ( Mega Auction ) లో రాహుల్ ను రూ.14 కోట్లకు ఢిల్లీ దక్కించుకున్న విషయం తెల్సిందే.