CBI Notice to MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బిగ్ ఝలక్ ఇచ్చింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చింది సీబీఐ.
ఈ మేరకు శుక్రవారం ఆమెకు 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఫిబ్రవరి 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ కేసు కు సంబంధించి ఈడీ పలుమార్లు కవితను ప్రశ్నించిన విషయం తెల్సిందే.
అయితే ఈడీ తనను విచారించడం పై సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవిత పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న జరగబోయే సీబీఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ఈ కేసులో కవితను సాక్షిగానే విచారించారు.