Google Maps | సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ప్రదేశాల్లో కూడా ప్రయాణాలు సలుభమయ్యాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా కొత్త ప్రాంతాల్లో కూడా ఎవరి సహాయం లేకుండా పర్యటించవచ్చు.
అయితే గూగుల్ మ్యాప్స్ ని కూడా మరీ గుడ్డిగా నమ్మి వెళితే ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ నమ్మి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
మహారాజ్ గంజ్ లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకెల్లింది. అప్రమత్తంగా లేకపోవడంతో ఫ్లై ఓవర్ నుంచి కిందికి గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. అదృష్టవశాత్తూ కారులోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.