Friday 6th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 25 ఏళ్లలో సెలవే తీసుకోలేదు.. ప్రధానిపై కెనడా పీఎం ప్రశంసలు!

25 ఏళ్లలో సెలవే తీసుకోలేదు.. ప్రధానిపై కెనడా పీఎం ప్రశంసలు!

canada pm praises modi

Canada PM Praises Modi | భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రశంసల వర్షం కురిపించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Canada PM Mark Carney). గత 25 ఏళ్లలో ఒక్కరోజు సెలవు కూడా తీసుకోకుండా ప్రధాని మోదీ ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇటీవల కెనడా ప్రధాని భారత్ లో పర్యటించిన ఆయన తాజగా ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్ లో చర్చలు జరిపారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధాని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని కొనియాడారు.

భారతదేశాన్ని ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, కెనడాకు సహజ భాగస్వామిగా వర్ణించారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) చర్చలు జరుపుతున్నామని తెలిపారు. “

మోదీ ప్రత్యేకమైన వ్యక్తి అని, గత 25 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా మోదీ చూపిన క్రమశిక్షణ, సంస్కరణలు, గ్రామీణ ప్రజలకు సంక్షేమం అందించేందుకు అవిరామ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

You may also like
Mallikarjuna Kharge
యూఎస్ ముందు మోదీ సరెండర్.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు!
sachin family invites pm modi for arjun sania wedding
రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన సచిన్ కుంటుంబం.. ఎందుకో తెలుసా!
bankim babu not bankim da
‘బంకిం దా కాదు.. బంకిం బాబు అని చెప్పాలి..’ ప్రధానికి ఎంపీ సూచన!
pm modi
ఈ దీపావళికి డబుల్ బొనాంజా.. ఎర్రకోట వేదికగా ప్రధాని కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions