Bus full of IPS officers visited Aamir Khan at his Bandra home | బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ ఇంటివద్ద కనిపించిన ఓ దృశ్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబయిలోని ఆయన నివాసానికి సుమారు 25 మంది ఐపీఎస్ అధికారులు వచ్చారు.
పోలీసు బస్సు, వ్యానులో వచ్చిన ఐపీఎస్ అధికారులు అనంతరం బాంద్రాలోని ఆమిర్ ఖాన్ నివాసంలోకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అధికారులు ఎందుకోసం ఆమిర్ ఖాన్ ఇంటికి వెళ్లారో అనేది తెలియాల్సివుంది.
నటుడ్ని కలవడం కోసమే అధికారులు వెళ్లారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు ఆమిర్ ఖాన్ ఇంటికి వెళ్లడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తమకు కూడా క్లారిటీ లేదని ఆమిర్ ఖాన్ టీం స్పందించింది.









