Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం: కేటీఆర్

ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం: కేటీఆర్

ktr

KTR Slams Congress Govt | తెలంగాణ ప్రభుత్వంపై (TG Government) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR).

తెలంగాణ కేబినెట్ మీటింగ్ (Telangana Cabinent Meeting) లో తీసుకున్న నిర్ణయాలపై కేటీఆర్ స్పందించారు.

ముఖ్యంగా సన్న రకాలకు మాత్రమే బోనస్ అని ప్రకటించడంపై ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదిక రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

“ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా?

ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??

ఇది ప్రజా పాలన కాదు. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.

ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రెండు లక్షల రుణమాఫీ అన్నారు. చేయలేదు.  నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.

ఓట్ల నాడు ఒకమాట. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ సర్కారు.

ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.

తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ. జై కిసాన్.. జై తెలంగాణ” అని రాసుకొచ్చారు కేటీఆర్.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions