Friday 25th April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > “మీది ఫెయిల్యూర్.. మాది పవర్ ఫుల్” సిద్దరామయ్యకు కేటీఆర్ కౌంటర్!

“మీది ఫెయిల్యూర్.. మాది పవర్ ఫుల్” సిద్దరామయ్యకు కేటీఆర్ కౌంటర్!

ktr vs Siddaramaiah

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).

శుక్రవారం కామారెడ్డి(Kamareddy)లో బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్న సిద్ధరామయ్య సీఎం కేసీఆర్ (CM KCR) పై తీవ్ర విమర్శలు చేసారు.
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కు ఎక్స్ వేదికగా ఘాటుగా బదులిచ్చారు కేటీఆర్.

“సిద్ధరామయ్య గారు.. కర్ణాటకలో మీది “5 గంటల.. ఫెయిల్యూర్ మోడల్”

తెలంగాణలో మాది “24 గంటల.. పవర్ – ఫుల్ మోడల్”

అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే…

తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం మీది

రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని మీరు..

మీ ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని.. ఐదేళ్లయినా అమలుచేయలేరు.

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే..

ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే…

మీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి..

నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి..

ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి

ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ” అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

You may also like
ktr
రాహుల్ గాంధీ పేరు అలా పెట్టుకుంటే బాగుంటుంది: కేటీఆర్
ktr comments
అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా: కేటీఆర్
ktr
ఏడో గ్యారెంటీని అమలు చేస్తున్నారు..సీఎం పై కేటీఆర్ ఆగ్రహం!
ktr comments
‘ఇలాంటి ఘటనలు మీ కుటుంబలో జరిగితే.. రాహుల్ జీ!!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions