BRS Silver Jubilee Celebrations Meeting In Warangal | భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ, రజతోత్సవ మహాసభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా ముఖ్య నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఏప్రిల్ 27న బీఆరెస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ను బీఆరెస్ నాయకులు కలిశారు. సభకు 3000 బస్సులను కేటాయించాలని సజ్జనర్ ను బీఆరెస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ కోరారు.
ఈ మేరకు బస్సులకు అయ్యే ఖర్చు రూ.8 కోట్ల చెక్కును సజ్జనర్ కు అందజేశారు. ఇదిలా ఉండగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. అనంతరం 2022 అక్టోబర్ 5న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. ఇకపోతే 27 తారీఖున జరగబోయే సభలో కేసీఆర్ ఎం మాట్లాడబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది.