Harish Rao Fires On Congress | బీఆరెస్ నేత హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ పార్టీ (Congress) పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మూలంగానే రైతు బంధు నిలిచిపోయిందని ధ్వజమెత్తారు.
సోమవారం జహీరాబాద్ లో నిర్వహించిన బీఆరెస్ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేయడం వల్లనే ఈసీ రైతు బంధును నిలిపివేసిందని ఆరోపించారు.
రైతు బంధు (Rythu Bandhu) ను ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ నేతలు, హరీష్ రావు వాడుకుంటున్నారని అందుకోసం ఆ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఆయన.
కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడి ముద్దను లాక్కుంటుందని, వారు ఇవ్వరు ఇచ్చే వారిని అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు. బిడ్డా ఇంకా ఎన్ని రోజులు ఆపుతారు.. మహా అయితే డిసెంబర్ 3వ తారీఖు వరకు ఆపుతారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆరే.
ఎన్నికల ఫలితాల తర్వాత కచ్చితంగా రైతు బంధు వస్తుందని స్పష్టం చేశారు హరీష్. తమది రైతులతో ఓటు బంధం కాదని పేగు బంధం అని పేర్కొన్నారు.