British F-35B Fighter Jet On Sale On OLX? | బ్రిటిష్ రాయల్ నేవికి చెందిన ఎఫ్-35బి ఫైటర్ జెట్ ఆదివారం కేరళ తిరువనంతపురంలో ఏమర్జెన్సీ ల్యాండ్ అయిన విషయం తెల్సిందే.
ఇదే సమయంలో ఈ ఫైటర్ జెట్ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ఉందని ఒక పోస్ట్ వైరల్ గా మారడం సంచలనంగా మారింది.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత నేవితో కలిసి సంయుక్త సైనిక విన్యాసాల్లో బ్రిటిష్ ఫైటర్ జెట్ పాల్గొంది. అయితే సాంకేతిక లోపంతో ఈ ఫైటర్ జెట్ అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ విమానం భారత్ లోనే ఉంది. ఇదే సమయంలో ఎఫ్-35బి విమానం అమ్మకానికి ఉందని ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫైటర్ జెట్ కు సంబంధించిన ఫోటోను తీసిన ఓ యూజర్ ఇది అమ్మకానికి ఉందని ప్రముఖ ఆన్లైన్ సంస్థ OLX లో పెట్టినట్లుగా సదరు పోస్టులో కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసాయిగా కంగుతిన్నారు. బ్రిటిష్ నేవీకి చెందిన ఫైటర్ జెట్ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ఉండడం ఏంటని ఆశ్చర్యపోయారు.
నాలుగు మిలియన్ల డాలర్లకు అంటే సుమారు రూ.34 కోట్లకు దీన్ని అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెట్టిన యూజర్ పేరు డోలాండు ట్రంపాన్ గా వైరల్ గా మారిన పోస్టులో ఉంది. అయితే సదరు పోస్టు ఫేక్ అని తేలింది.










