Bride attends Group-2 mains exam on wedding day in Tirupati | ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం జరిగిన విషయం తెల్సిందే.
92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. 175 కేంద్రాల్లో పరీక్ష కొనసాగుతుంది. కాగా ఓ నవ వధువు పరీక్షకు హాజరవడం ఆసక్తిగా మారింది.
పెళ్లి దుస్తువుల్లోనే కేంద్రానికి వచ్చిన నవ వధువు పరీక్షను రాశారు. చిత్తూరులో ఆదివారం ఉదయం ఆరు గంటలకు నమిత వివాహం చేసుకున్నారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లి మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు.
తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే ఆమె కేంద్రానికి వచ్చి మరీ పరీక్ష రాయడం పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.