- దేశవ్యాప్తంగా చిన్నారుల కోసం 10 వేల టికెట్లు కొంటానన్న రణ్ బీర్ కపూర్
- తెలుగు రాష్ట్రాలలో 10 వేల టికెట్లు ఉచితంగా ఇవ్వనున్న అభిషేక్ అగర్వాల్
Adipursh Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడి (Sriram) పాత్రలో కృతిసనన్ (Kriti Sanan) సీత పాత్రలో అలరించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణుడి పాత్రలో నటించారు.
భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను భూషణ్ కుమార్ (Bhushan Kumar) నిర్మించారు. రామాయణం (Ramayan) ఆధారంగా ఈ సినిమాను ఆదిపురుష్ ను తెరకెక్కించారు. జూన్ 16 ఆదిపురుష్ దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా సందడి మొదలైంది. మంగళవారం తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ అభిమానుల్లో మరింత జోష్ నింపింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కానుంది.
10,000 ఆదిపురుష్ టిక్కెట్ల విరాళం..
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాపై పలువురు నటులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ (Ranbeer Kapoor) ఆదిపురుష్‌కు తన మద్దతును ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు 10,000 టిక్కెట్లను రణబీర్ విరాళంగా ఇవ్వనున్నారు. తన చిన్ననాటి రోజుల్లో రామాయణం నుండి చాలా నేర్చుకున్నాననీ, నేటి తరం పిల్లలు కూడా శ్రీరాముని కథ నుండి చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు రణబీర్ కపూర్ తెలిపారు.
అందుకోసమే దేశవ్యాప్తంగా నిరుపేద చిన్నారుల కోసం 10 వేల టికెట్లు కొనుగోలు చేసి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 10000+ టికెట్లు ఉచితంగా పంపిణీ..
కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files), కార్తికేయ (Karthikeya) చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) కూడా ఆదిపురుష్ సినిమాపై తన ప్రేమను చాటుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10వేలకు పైగా టికెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.