Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > “ఖాసీం రజ్వీ వారసుల ముందు ప్రమాణ స్వీకారం చేయను”

“ఖాసీం రజ్వీ వారసుల ముందు ప్రమాణ స్వీకారం చేయను”

raja singh

BJP MLAs Boycott Assembly Session | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం నుండి ప్రారంభం అయ్యాయి. కాగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఎంపికయ్యారు.

ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ (MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక వీడియో ను విడుదల చేశారు. ఖాసీం రజ్వీ వారసులు ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణం చేయనని తేల్చి చెప్పారు.

తానే కాకుండా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లెవరు ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. 2018 కూడా అప్పటి టీఆరెస్ ప్రభుత్వం ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ (Pro Tem Speaker) గా ఎంపిక చేస్తే ఎమ్మెల్యే గా తాను ప్రమాణం చేయలేదని గుర్తు చేశారు.

కాగా గతం లో 15 నిమిషాల సమయం ఇస్తే వంద కోట్ల హిందువులను చంపేస్తా అంటూ హెచ్చరించిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా ఎలా ఎంపిక చేసారంటూ మండిపడ్డారు ఈ నేత.

ఇదిలా ఉండగా శనివారం ఉదయం బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం శనావారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions