BJP First List| రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాను ప్రకటించింది అధికార బీజేపీ ( BJP ). 195 మంది అభ్యర్ధిలతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
ప్రధాని మోదీ ( Pm Modi ) మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ( Varanasi ) నుండి పోటీ చేయనుండగా, హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) గాంధీ నగర్ నుండి బరిలో నిలవనున్నారు.
195 మందిలో 28 మహిళలకు చోటు దక్కింది. 18 మంది ఎస్టీలకు, 27 మంది ఎస్సి, 57 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
అలాగే 47 మంది యువతకు అవకాశం లభించింది. 34 మంది కేంద్ర మంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. కాగా తెలంగాణ నుండి ఒకేసారి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.n
వెస్ట్ బెంగాల్ నుండి 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ నుండి 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.









