Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > అమ్మకు అన్నం పెట్టనోడు.. సీఎంపై కేటీఆర్ బీజేపీ ఫైర్

అమ్మకు అన్నం పెట్టనోడు.. సీఎంపై కేటీఆర్ బీజేపీ ఫైర్

BJP And KTR Fires On Cm Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై భారతీయ జనతా పార్టీ మరియు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీల పోస్టర్లను రిలీజ్ చేశారు. వీటి అమలు బాధ్యత తనది అంటూ సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్..తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు కానీ ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా? అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం ఉందని మండిపడ్డారు.

మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సొంత తల్లికి మట్టిగాజులు తేలేనోడు..పినతల్లికి బంగారు గాజులు ‘చేయి’స్తానన్నాడట! అంటూ సీఎంపై విరుచుకుపడింది.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions