Sunday 29th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సైఫ్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

సైఫ్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్

Big Twist In Saif Ali Khan Case | బాలీవుడ్ ( Bollywood ) నటుడు సైఫ్ అలీఖాన్ పై జనవరి 16 తెల్లవారుజామున దుండగుడు కత్తితో దాడి చేసి పరారయిన విషయం తెల్సిందే.

దుండగుడు జరిపిన కత్తి దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నటుడు కోలుకుంటున్నారు. మరోవైపు దాడికి సంబంధించిన కేసులో పోలీసులు షరీఫుల్ ఇస్లాంను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ( Big Twist ) నెలకొన్నట్లు కథనాలు వస్తున్నాయి.

బాంద్రా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశంలో 19 వేలిముద్రలను సేకరించారు. కానీ సేకరించిన వేలిముద్రలతో నిందితుడి వేలిముద్రలు సరిపోలడం లేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ( Criminal Investigation ) బృందం సేకరించిన వేలిముద్రలతో నిందితుడి ఫింగర్ ప్రింట్స్ ( Finger Prints ) మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది.

తదుపరి విచారణ కోసం మరోసారి దాడి జరిగిన ప్రదేశం నుండి వేలిముద్రలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions