Bhatti asks police to withdraw cases against HCU students | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల HCU విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దింతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజగా హెచ్సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సోసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ భేటీ అనంతరం విద్యార్ధులపై నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని భట్టి స్పష్టం చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన కేసును వెంటనే వాపస్ తీసుకోవాలని పేర్కొన్నారు.
కేసుల ఉపసంహరణ సమయంలో ఎలాంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసులకు తగిన సూచనలు చేయాలని న్యాయశాఖ అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు.