Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మాజీ ప్రధాని పీవీకి భారతరత్న!

మాజీ ప్రధాని పీవీకి భారతరత్న!

PV Narasimha Rao
  • ఛౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా దేశ అత్యున్నత పురస్కారం

Bharata Ratna For PV | భారత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆయనతోపాటు మాజీ పీఎం చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఇటీవలే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వాణీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు ఈ ఏడాది భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించినట్లైంది. 

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు..
తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు భారత్ కు 9వ ప్రధానిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకూ ఆయన దేశ ప్రధానిగా సేవలందించారు. ఆ సమయంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యుడిగా సేవలందించారు పీవీ నరసింహరావు.  

ఛౌదరి చరణ్ సింగ్ కు..
తాజాగా భారతరత్న పురస్కారం పొందిన చౌధరి చరణ్ సింగ్ 1979 జులై  నుంచి 1980 జులై వరకూ దాదాపు ఏడాది కాలం ప్రధానిగా సేవలందించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఆయన తొలి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి. జనతా పార్టీ నుంచి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. చరణ్ సింగ్ ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయన రాజీనామా తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయ్యారు. అయితే ప్రధాని హోదాలో ఒక్క రోజు కూడా పార్లమెంట్‌కు వెళ్లకుండానే పదవి నుంచి నిష్క్రమించారు చరణ్ సింగ్. పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించకోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

హరిత విప్లవ పితామహుడు..
భారత దేశ హరిత విప్లవ పితామహుడిగా పేరొందారు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయ రంగంలో చేసిన విశేష సేవలకు కేంద్రం తాజాగా భారతరత్న పురస్కారం ప్రకటించింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో కీలక సంస్కరణలు చేపట్టారు. భారతదే వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా   ప్రయత్నాలు చేసి మెరుగైన ఫలితాలు సాధించారు. స్వామినాథన్ సంస్కరణలతో దేశ ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ లభించింది.

You may also like
నాగచైతన్య-శోభిత పెళ్లిపై నాగార్జున ఏమన్నారంటే !
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions