BCCI lodges complaint with ICC about Pakistan players | పాకిస్థాన్ ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఆసియా కప్-2025 లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండు మ్యాచుల్లో వివాదాలు చెలరేగాయి.
మరీ ముఖ్యమంత్రి పాక్ ప్లేయర్లు హారీస్ రవూఫ్ మరియు ఫర్హాన్ లు రెచ్చగొట్టే విధంగా హావభావాలు ప్రదర్శించడం పట్ల ఇప్పటికే అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో ఈ ఇద్దరిపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లపై చర్యలకు ఉపక్రమిస్తూ బీసీసీఐ ఐసీసీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.
కాగా మ్యాచ్ సందర్భంగా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం గన్ షాట్ సంబరాలు చేసుకున్నాడు. భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సంబరాలు చేసుకోవడం రెచ్చగొట్టడమే అవుతుంది. అలాగే హారీస్ రవూఫ్ తీరు అయితే భారత అభిమానులకు కోపాన్ని తెప్పించింది.
మైదానంలో అభిషేక్, గిల్ తో గోడవపెట్టుకున్న అతడు ఫైటర్ జెట్లు కూలినట్లు, 6-0 అని చేతి వేళ్ళతో సైగలు చేశాడు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు పాక్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో హారీస్ రవూఫ్ సంబరాలపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి సెలబ్రేషన్స్ పై బీసీసీఐ తాజగా ఫిర్యాదు చేసింది.









