BCCI announces ₹51 crore cash reward for ICC Women’s World Cup-winning Team India | మహిళల ప్రపంచ కప్ ను టీం ఇండియా కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తు చేసి, 47 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెర దించి టీం ఇండియా విశ్వ విజేతగా నిలిచిన తరుణం ప్రతీ భారతీయుణ్ణి భావోద్వేగానికి గురి చేసింది.
మైదానంలో ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి వనితల పోరాటాన్ని కీర్తించారు. వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన టీం ఇండియాకు ఐసీసీ ఛైర్మన్ జై షా ట్రోఫీని అందజేశారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ ప్రపంచ కప్పును ప్లేయర్లతో పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా విజేతగా నిలిచిన భారత్ కు ఐసీసీ రూ.39 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. రన్నరప్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకు రూ.20 కోట్లు దక్కుతాయి. టీం ఇండియా విజేతగా నిలిచిన తరుణంలో బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. జట్టుకు రూ.51 కోట్ల నజరానాను ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా ప్రకటించారు. జట్టులోని ఆటగాళ్లు, సిబ్బంది ఈ డబ్బులను పంచుకుంటారు.









