Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

bandi sanjay

Bandi Sanjay Comments On Kavitha Issue | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) లేఖ, తదనంతర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఇష్యూ అంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని కొట్టిపారేశారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్‌ జరుగుతోందంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.

బీఆర్ఎస్ పార్టీలో చార్‌పత్తా ఆట నడుస్తోంది. కవిత, కేటీఆర్, సంతోష్, హరీష్ రావు చార్ పత్తా అయితే.. కేసీఆర్ జోకర్ అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తోందని ఆరోపించారు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తే తాము బీఆరెస్ ను దగ్గరికి రానివ్వలేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కవిత రాసిన లేఖ కాంగ్రెస్ డైరెక్షన్‌లో జరిగిన డ్రామా అని.. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని, అందుకే తాము వారిని దగ్గరికి రానివ్వమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నా బీజేపీ ప్రస్థానం ఆగదని.. తెలంగాణ సమాజం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోందని బండి సంజయ్ అన్నారు. 

You may also like
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ponguleti srinivasa reddy
దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
komatireddy venkat reddy
‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions