Banana Sells For Rs.52 Crore In Art Auction | సాధారణంగా పండ్ల మార్కెట్ లో డజను అరటిపళ్ళ ధర రూ.100 లోపే ఉంటుంది. కానీ టేపుతో గోడకు అంటించిన ఒకే ఒక్క అరటిపండు విలువ రూ.52 కోట్లు.
అమెరికా న్యూయార్క్ ( Newyork ) లో నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్ ( Banana Art Work ) ఏకంగా రూ.52 కోట్లకు పలికింది. గోడకు అరటిపండును టేపు సాయంతో అతికించారు. అంతే దీన్ని కొనేందుకు ధనవంతులు ఎగబడ్డారు.
ఇటాలియన్ మౌరిజియో కాటెలాన్ ( Maurizio Cattelan ), కమీడియన్ పేరుతో టేప్ బనానా ఆర్ట్ వర్క్ ను తయారుచేశాడు. తాజగా న్యూయార్క్ లో జరిగిన వేలంలో ఈ బనానా టేప్ ను చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీ బిజినెస్ మాన్ జస్టిన్ సన్ ( Justin Sun ) 6.2 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
అయితే అరటిపండు కుళ్ళిపోయినప్పుడల్లా మరొకదాన్ని టేపు కింద పెడుతారు. 2019లో తొలిసారి మియామీలో జరిగిన వేలంలో దీన్ని ప్రదర్శింగా అప్పటినుండి ఈ ఆర్ట్ వైరల్ గా మారింది. 2023లో సౌత్ కొరియా ( South Korea )లోని ఓ మ్యూజియంలో బనానా టేప్ ను ప్రదర్శనకు పెట్టారు.
అయితే ఆకలేస్తుందని ఓ పిల్లాడు అరటిపండును తినేశాడు. వెంటనే మరో అరటిపండును అక్కడ పెట్టారు.