Baahubali: The Epic Movie | ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోయి ఉంటే ఏమి జరిగేది. ఈ ప్రశ్నకు భల్లాలదేవ పాత్రలో ఒదిగిపోయిన రాణా ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.
ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోయి ఉంటే తానే బాహుబలిని చంపేసే వాడిని అని భల్లాల దేవ సమాధానం ఇచ్చాడు.
ప్రభాస్ కథానాయకుడిగా, రాణా దగ్గుబాటి విలన్ గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా యావత్ దేశాన్ని షేక్ చేసింది. బాహుబలి-2 అయితే కలెక్షన్ల సునామీని సృష్టించి, దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిన భారీ క్రేజ్ పెంచేసింది.
అయితే బాహుబలి పార్ట్-1 విడుదల తర్వాత నమ్మిన బంటు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న సినీ అభిమానులను ఆలోచించేలా చేసింది. ఇప్పుడు బాహుబలి విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రెండు భాగాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ గా అక్టోబర్ 31న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ‘బాహుబలి ది ఎపిక్’ పేరిట ఉన్న అధికారిక సోషల్ మీడియా ఖాతా నుండి ఒక ప్రశ్నను మేకర్స్ పోస్ట్ చేశారు.
కట్టప్ప బాహుబలిని చంపకపోయి ఉంటే ఏమి జరిగేది ? అని మేకర్స్ సరదాగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రాణా బాహుబలిని తానే చంపేవాడిని అని తనలోని భల్లాల దేవ పాత్రలా సమాధానం ఇచ్చారు.