Atul Subash Incident News | ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన టెకీ అతుల్ సుభాష్ ఆదివారం బెంగళూరులోని ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.
ఆత్మహత్య కంటే ముందు 40 పేజీలు సూసైడ్ నోటును, ఒక వీడియోను ఆయన చిత్రీకరించారు. ఇందులో భార్య తనను ఎంతలా వేదించిందో వివరించాడు. సెక్షన్ 498a దుర్వినియోగం చేస్తూ భార్య తనపై అక్రమ గృహహింస, క్రిమినల్ కేసులు పెట్టినట్లు ఆవేదన చెందాడు.
అంతేకాకుండా కేసులన్ని వాపస్ తీసుకోవాలంటే రూ.3 కోట్ల ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకోవాల్సిందిగా భార్య, ఆమె తల్లి మరియు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినట్లు అతుల్ సుభాష్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ జాన్ పూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి రితా కౌశిక్ తనతో, తన భార్యతో జరిగిన ప్రైవేట్ మీటింగులో తన ఆర్ధిక పరిస్థితిని చూసి నవ్వినట్లు ఆరోపించారు.
కేసును సెటిల్ చేయాలంటే ఆమె లంచం అడిగినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థ తనతో ఆడుకుందని సుభాష్ కన్నీరు పెట్టుకున్నారు.
ఇదే సమయంలో అతుల్ సుభాష్ గాధను విన్న నెటిజన్లు పురుషులకు న్యాయస్థానాల్లో వివక్ష ఎదురవుతుందని, 498a సెక్షన్ ను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని పోస్టులు చేస్తున్నారు. పురుషులు కూడా వేధింపులకు గురి అవుతున్నారని తెలుయాజేస్తూ #mentoo అని ట్వీట్లు చేస్తున్నారు.