Attack On Delhi CM | ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా (CM Rekha Gupta)పై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రతివారం తన అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ (JanSunwai) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా సీఎంకు తన సమస్యను వివరించేందుకు వచ్చిన ఓ యువకుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అంతలోనే గట్టిగా అరుస్తూ సీఎం రేఖా గుప్తపై దాడి చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడిని రాజ్ కోట్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామంతో సీఎం రేఖా గుప్త షాక్ గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెనె వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.









