Monday 16th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బిల్లులన్నీ సొంతడబ్బులతోనే చెల్లించాలి: సీఎం

మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బిల్లులన్నీ సొంతడబ్బులతోనే చెల్లించాలి: సీఎం

assam cm himantha

CM Himantha | రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జులై నెల నుండి వారి విద్యుత్ చార్జీలను వారే సొంత డబ్బులతో చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు అస్సాం సీఎం హిమాంత బిశ్వాశర్మ.

ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. జులై నుండి తాను, సీఎస్ ఈ నిబంధనను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.

75 ఏళ్లుగా మన దేశంలోని మంత్రుల, ప్రజా ప్రతినిధుల, ప్రభుత్వ ఉన్నతాధికారుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, కానీ ఇక నుండి ఈ విఐపి సంస్కృతికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనివల్ల విద్యుత్ బోర్డుకు వచ్చే నష్టాలను నివారించవచ్చని, దింతో విద్యుత్ శాఖ కరెంట్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేదని తెలిపారు.

You may also like
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions