Ashwin Retires From International Cricket | టీం ఇండియా ( Team India ) లెజెండరీ బౌలర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టు డ్రా గా ముగిసింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma )తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన అశ్విన్ ఈ మేరకు రిటైర్మెంట్ ( Retirement )ను ప్రకటించారు. అంతకుముందు డ్రెసింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli )తో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ గా మారింది.
‘ భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా ఫీల్ అవుతున్న. ఇప్పుడు సమయం వచ్చిందనుకుంటున్నా. భారత క్రికెట్ లో నా భాగస్వామ్యం ఉండడం ఆనందంగా ఉంది’ అంటూ అశ్విన్ ప్రకటన చేశారు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు రోహిత్ శర్మ పేర్కొన్నారు.
మిగిలిన రెండు టెస్టుల్లో అశ్విన్ ఆడడని స్పష్టం చేశారు. గురువారం ఆయన స్వదేశానికి వెళ్లనున్నట్లు రోహిత్ వెల్లడించారు. కాగా 106 టెస్టులు, 116 వన్డే ( ODI )లు, 65 టీ-20లు ఆడిన అశ్విన్ మొత్తంగా 4,400 పరుగులు మరియు 765 వికెట్లు తీశాడు.










