Arvind Kejriwal Turns Santa Claus | క్రిస్మస్ ( Christmas ) పర్వదినం సందర్భంగా రాజకీయ ప్రముఖులు, పార్టీలు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ( Aam Admi Party ) వినూత్నంగా విషెస్ ( Wishes ) తెలియజేసింది. ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) శాంతాక్లాజ్ వేషధారణలో ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది.
అలాగే శాంతాక్లాజ్ గా మారిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు పథకాలు అనే బహుమతులను అందజేస్తున్నట్లు అందులో ఉంది. ఢిల్లీ ప్రజలకు వారి సొంత శాంతాక్లాజ్ ఏడాది పొడవునా పథకాలు అనే బహుమతులు ఇస్తూనే ఉన్నారని ఆప్ పేర్కొంది.
ఇప్పటికే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఉచిత విద్యుత్, విద్య, వైద్యం వంటివి అమలవుతున్నాయి. తాము మరోసారి అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఇస్తామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. కాగా వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.