YS Sharmila Comments | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా చీల్చిందని వాపోయారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల..కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చీల్చింది, మా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే వారికి గుణపాఠం చెబుతాడంటూ సీఎం జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
ఏపీ అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణమే చంద్రబాబు మరియు సీఎం జగన్ అని ఆరోపించారు. ఈ మేరకు గురువారం కాకినాడలో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలడానికి కారణం అది జగన్ చేతులరా చేసుకున్న పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సాక్ష్యం దేవుడు, విజయమ్మ మరియు యావత్ కుటుంబం అని స్పష్టం చేశారు షర్మిల.