Anurag Thakur On Rahul Gandhi | లోక్సభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ( Anurag Thakur ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
రాహుల్ గాంధీ కులం ఏంటని ప్రశ్నించిన ఆయన, కులం ఏంటో తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారని హాట్ కామెంట్స్ ( Hot Comments ) చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది.
అధికార, విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. కాగా తనను ఎన్ని సార్లు అవమానించినా తను బాధ పడనని, దేశ ప్రజల కోసం గళమెత్తుతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అనురాగ్ ఠాకూర్ స్పీచ్ ( Speech ) ని ప్రధాని మోదీ ఎక్స్ ( X )వేదికగా షేర్ ( Share )చేయడం ఆసక్తిగా మారింది.
తోటి సహచర సభ్యుడి ప్రసంగాన్ని కచ్చితంగా వినాలని ప్రధాని చెప్పారు. అలాగే ఫాక్ట్స్ తో కూడిన అనురాగ్ ఠాకూర్ స్పీచ్ లో ఇండీ కూటమి డర్టీ పాలిటిక్స్ ( Dirty Politics ) తెలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు ( Records )ల నుండి తొలగిస్తామని చెప్పారని, మరి ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రధాని ఎలా షేర్ చేస్తారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ( Jairam Ramesh ) ప్రశ్నించారు.